

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా 158’ చిత్రం తొలి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ షూటింగ్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ పాటలు రాస్తుండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఎక్కువ భాగం గోదావరి ప్రాంతం నేపథ్యంగా సాగుతుందని తెలిపారు. అయితే గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో పాటు నేటి తరం ప్రేక్షకులు, ముఖ్యంగా జెన్-జీని ఆకట్టుకునేలా దర్శకుడు బాబి కథను రూపొందించారని చెప్పారు. ఇప్పటికే తాను ఒక పాట రాశానని, అది యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!