

కన్నడ స్టార్ యష్ తల్లి పుష్ప (తానే ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కర్ణాటక పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. హరిష్ ఉర్స్ అనే పీఆర్ఓతో పాటు మనూ, నితిన్, మహేష్ గురు, స్వర్ణలత లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో నమోదు అయింది.
పుష్ప తెలిపిన వివరాల ప్రకారం, ఆమె నిర్మించిన కొట్టల్లవాడి సినిమాకు ప్రమోషన్ కోసం నిందితులకు మొత్తం ₹64 లక్షలు ఇచ్చారు. అయితే వారు సినిమాను ప్రచారం చేయకపోగా, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, డబ్బు తీసుకుని సినిమా దర్శకుడిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగిందని ఆమె పేర్కొన్నారు.
హరిష్ ఉర్స్ మొదట ₹23 లక్షలకు పబ్లిసిటీ చూసుకుంటానని ఒప్పుకుని, షూటింగ్ సమయంలో అదనంగా డబ్బు తీసుకున్నారని పుష్ప తెలిపారు. సినిమా రిలీజ్కు సిద్ధమైన తర్వాత, ఖాతాల గురించి అడిగితే సినిమా మీద నెగెటివ్ ప్రపగాండా పెడతామని హెచ్చరించాడని ఆమె ఆరోపించారు. అలాగే స్వర్ణలత, గురు వంటి నిందితులు మీడియా పరిచయాలు ఉన్నాయని, తమ గురించి నెగెటివ్ స్టోరీలు సృష్టించగలమని దర్శకుడిని బెదిరించారని చెప్పారు. ఇంకా చాలా మందిని వీరు మోసం చేసినప్పటికీ, భయంతో ఎవరూ బయటకు రావట్లేదని పుష్ప వెల్లడించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!