

కీర్తన్ నాగగౌడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘418’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుండటంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ‘418’ను అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘భయానికి సరిహద్దులు లేవు’ అనే క్యాప్షన్‌తో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ప్రకృతిలో విపత్తులు సంభవించే విషయాన్ని పక్షులు ముందుగానే పసిగడతాయనే ఆసక్తికరమైన వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అనంతరం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వెళ్లడం, ఓ రహస్యమైన గదిలోకి ప్రవేశించి తాము పెద్ద తప్పు చేశామని భయపడటం వంటి సన్నివేశాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. వారు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని చుట్టూ ఉన్నవారు కల్పిత కథగా కొట్టిపారేస్తారు. దేవిక పాత్ర భయపెట్టే రూపంలో కనిపించడంతో పాటు రక్తపాతం, ఊహించని మలుపులు, సస్పెన్స్ అంశాలతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!