

డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినకూడదని చాలా మంది భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా సరైనది కాదు. పండ్లలో సహజ చక్కెరతో పాటు పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యమైన విషయం పండ్లు తినకూడదనేది కాదు, ఎంత మోతాదులో, ఎప్పుడు తింటున్నామనేదే ముఖ్యం.
డయాబెటిస్ విషయంలో ద్రాక్ష, అరటిపండ్లు ఎక్కువగా చర్చకు వస్తాయి. ద్రాక్షలో పీచు తక్కువగా ఉండటంతో ఎక్కువగా తింటే చక్కెర త్వరగా రక్తంలోకి చేరుతుంది. అరటిపండు అయితే ఎంత పండిందన్నదానిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. తక్కువగా పండిన అరటిలో స్టార్చ్ ఉండి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఎక్కువగా పండిన అరటిపండు అయితే రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతుంది. ఇవి రెండూ మీడియం గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారాల్లోకి వస్తాయి కాబట్టి పరిమితంగా తీసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారు పండ్లు తినే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లను బాదం, వాల్నట్స్ లేదా పెరుగు వంటి ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకుంటే చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. జ్యూస్ కాకుండా పండును ముక్కలుగా తినడం మంచిది. పండ్లు తిన్న తర్వాత 10–15 నిమిషాలు నడక చేస్తే చక్కెర శక్తిగా మారుతుంది. సరైన అలవాట్లతో పండ్లు డయాబెటిస్ రోగులకు కూడా ఆరోగ్యకరమే.
గమనిక: రక్తహీనత తీవ్రంగా ఉన్నవారు స్వయంగా మందులు వాడకుండా ముందుగా రక్తపరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!