

కరివేపాకు వెల్లుల్లి కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చితో తయారయ్యే ఈ కారం రుచికరమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా వానాకాలంలో ఈ వంటకం తినడం శరీరానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని చపాతీ, అన్నం, టిఫిన్‌లతో తినడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కరివేపాకు ఆకులు, 10 వెల్లుల్లి రెబ్బలు, 15 ఎండు మిర్చి, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె.
తయారీ విధానం కోసం ముందుగా పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకు ఆకులు వేయించి కరకరలాడే వరకు వేయించాలి. తరువాత శనగపప్పు, మినప్పప్పు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. తరువాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మధ్య మంటపై వేయించాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. చివరగా కరివేపాకు ఆకులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి. ఇలా చేసిన కారం రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!