
ఆరోగ్యం

పాఠశాలల 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ విక్రయాలను నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు ఎనర్జీ డ్రింక్‌లను సులభంగా కొనుగోలు చేయకుండా నిరోధించడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వినియోగం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ, పాఠశాల పరిసరాలను మరింత సురక్షితంగా ఉంచే దిశగా ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!