

ప్రయాణ సమయంలో తల తిరగడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలను వైద్య భాషలో మోషన్ సిక్నెస్ అంటారు. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో, మలుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణం చేసే వారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణంలో కళ్ల నుంచి, చెవుల్లోని బ్యాలెన్స్ సిస్టమ్ నుంచి మెదడుకు వేర్వేరు సంకేతాలు వెళ్లడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుంది. కళ్ళు “శరీరం కదలడం లేదు” అని సంకేతమిస్తే, చెవులు “శరీరం కదులుతోంది” అని చెబుతాయి. ఈ విభిన్న సంకేతాలను మెదడు విషపదార్థాలుగా భావించి శరీరాన్ని అలర్ట్ చేస్తుంది. వాటిని బయటకు పంపేందుకు శరీరం తీసుకునే సహజ చర్యే వాంతులు అని వైద్యులు వివరించారు.
వాంతులు రాకుండా ఉండాలంటే ప్రయాణంలో కిటికీ దూరంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కళ్ళు, చెవుల నుంచి వచ్చే సంకేతాలను మెదడు సరిగ్గా సమన్వయం చేసుకుని అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో లేదా అతిగా తిని ప్రయాణం చేయడం, వాహనంలో నిద్రపోవడం కూడా మోషన్ సిక్‌నెస్‌ను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రతి ముగ్గురిలో ఒకరిని ప్రభావితం చేస్తుందని, పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల కారణంగా ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యుల అభిప్రాయం.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!