
రివ్యూలు

వర్షాకాలంలో జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా శరీరానికి బలం ఇచ్చే పానీయాల్లో కొబ్బరి పాలు బాదం డ్రింక్ ఒకటి. ఇది కొబ్బరి పాలు, బెల్లం, యాలకులు, మిరియాలు, కుంకుమపువ్వు, జీడిపప్పు, బాదంతో తయారవుతుంది. వేడి గానీ చల్లగా గానీ తాగవచ్చు.
కొబ్బరిని నీటితో గ్రైండ్ చేసి గట్టిగా పాలు తీసుకుని బెల్లంతో మరిగించాలి. తర్వాత యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా వేయించిన జీడిపప్పు, బాదం, కుంకుమపువ్వు కలిపి సర్వ్ చేయాలి. ఇది శరీరానికి శక్తినిచ్చే ఆరోగ్యకరమైన డ్రింక్.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!