

ముఖ కండరాలను చురుగ్గా ఉంచేందుకు కొన్ని యోగా, ముఖ వ్యాయామ పద్ధతులను అనుసరించవచ్చు. వీటిలో మత్స్యాసనం ఒకటి. వజ్రాసనంలో కూర్చొని కళ్లను మూసుకుని, చేప నోటిని పోలినట్లు పెదవులను ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి రావాలి. అలాగే నుదుటి వ్యాయామంలో కనుబొమలను పైకి లేపి, వేళ్లతో పట్టుకుని పది వరకు లెక్కపెట్టాలి. అనంతరం వాటిని నెమ్మదిగా కిందకు దించాలి. ఈ కదలికలను కొద్దిసేపు విరామంతో కొన్ని సార్లు చేయవచ్చు. బుగ్గల వ్యాయామంలో నోటిలో గాలి నింపి బెలూన్‌లా ఉంచి, నెమ్మదిగా బయటకు వదలాలి. అనంతరం బుగ్గలు, మెడ, గడ్డం భాగాలను సున్నితంగా మసాజ్ చేయాలి.
ముఖాన్ని కదలకుండా ఉంచి రెండు చేతులతో నుదుటి నుంచి తల వరకు పట్టుకుని పది సెకన్ల పాటు ఉండే వ్యాయామాన్ని కూడా ప్రయత్నించవచ్చు. మరో పద్ధతిలో రెండు అరచేతులతో బుగ్గలను పైకి ఎత్తి, నోరు తెరిచి 'ఓం' అని పలకాలి. అలాగే మోకాళ్లపై నిల్చుని, యోగా మ్యాట్‌పై చేతులను ఉంచి, బొటనవేలు, చూపుడు వేలితో పెదవులను సున్నితంగా పట్టుకుని కిందివైపు లాగాలి. ఈ వ్యాయామాలను చేసేటప్పుడు ఒత్తిడి కలిగించకుండా, సౌకర్యవంతమైన పరిమితుల్లోనే చేయాలి. ముఖ కండరాల వ్యాయామాలు ముఖ ఆకృతిని మార్చుతాయని లేదా ముడతలను తొలగిస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. నొప్పి లేదా అసౌకర్యం కలిగితే వెంటనే ఆపాలి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!