
సినిమాలు

సాధారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే కొందరిలో పగటిపూట కూడా అధిక నిద్ర, మగతగా ఉండటం కనిపిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో సోమ్నోలెన్స్ లేదా అతి నిద్ర అంటారు. ఇది సాధారణ అలసట మాత్రమే కాకుండా అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్లీప్ అప్నియా ఈ సమస్యకు ప్రధాన కారణాలలో ఒకటి. నిద్రలో శ్వాసలో అంతరాయం వల్ల పూర్తిగా విశ్రాంతి లభించదు. అదనంగా థైరాయిడ్ సమస్యలు, విటమిన్ డి మరియు బి12 లోపం, డిప్రెషన్, కిడ్నీ లేదా లివర్ సమస్యలు కూడా కారణమవుతాయి. అరుదుగా నార్కోలెప్సీ వంటి నాడీ సంబంధిత రుగ్మతలు కూడా అతి నిద్రకు దారి తీస్తాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!