

వానాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యలు తరచూ ఎదురవుతాయి. ఈ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. టమాటా, కేరట్, బీన్స్, గుమ్మడికాయలతో చేసిన వేడి సూప్ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించి శక్తిని ఇస్తుంది. బియ్యం, పప్పులు, కూరగాయలతో తయారుచేసిన కిచిడీ తేలికగా జీర్ణమై కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచులు అందిస్తుంది. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉదయం రాగి జావను మజ్జిగ లేదా పాలతో, బెల్లంతో తీసుకుంటే కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇడ్లీ-సాంబార్, ఓట్స్ ఉప్మా, అటుకుల ఉప్మా వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చటి పాలలో పసుపు, మిరియాల పొడి కలిపి తాగడం ఉపశమనాన్ని ఇస్తుంది. ఎప్పుడూ వేడి వేడి తాజా ఆహారం తీసుకోవాలి. నిల్వ ఆహారం, చల్లని పానీయాలు, జంక్ ఫుడ్‌లను నివారించి, తగినంత నీరు తాగుతూ రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉండవచ్చు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!