

జొన్నలు అత్యంత పోషక విలువలున్న మిల్లెట్లలో ఒకటి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. జొన్న బిస్కెట్లు ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్‌గా ఉపయోగపడతాయి. వీటిని ఉదయం టిఫిన్‌గా లేదా సాయంత్రం టీతో పాటు తినవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం వాడితే ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది.
తయారీ విధానం కోసం ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు గోధుమ పిండి, అర కప్పు బెల్లం పొడి, పావు కప్పు నెయ్యి లేదా వెన్న, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, ఒక కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ముందుగా పిండులు, బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి, తర్వాత బెల్లం, యాలకుల పొడి, నెయ్యి కలపాలి. పాలు పోస్తూ గట్టిగా పిండి తయారు చేసి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తరువాత రోలింగ్ చేసి బిస్కెట్ ఆకారంలో కట్ చేసి 180°C వద్ద 10 నిమిషాలు బేక్ చేయాలి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తాయి, రోజంతా శక్తిని ఇస్తాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!