
రాజకీయాలు

బీజేపీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉప ఎన్నిక నిర్వహణ అంశంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే లేని ఏకైక నియోజకవర్గం ఖైరతాబాద్ అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఖైరతాబాద్కు ఉప ఎన్నిక నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నిక నిర్వహణపై న్యాయపరమైన పోరాటం చేసేందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!