

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ‘యానిమల్’ తర్వాత సందీప్ తీస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రభాస్‌తో ఆయన తొలి మూవీ కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్ట్, నిర్మాతలు, నటీనటులు అన్నీ సిద్ధంగా ఉన్నా, ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైంది. అయితే రెండు సంవత్సరాల క్రితమే కథ నచ్చడంతో ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అభిమానులు ప్రభాస్‌ను సందీప్ వంగా స్టైల్లో ఎలా చూపిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదలైన ‘స్పిరిట్’ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. గుబురు గడ్డం, గాయాలతో రఫ్ లుక్‌లో కనిపించిన ప్రభాస్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోస్టర్ తర్వాత, సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే 2027 మార్చి 5 న విడుదల అంటూ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ డేట్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, మరో హీరోయిన్ కూడా ఉండవచ్చన్న ప్రచారం ఉంది. వివేక్ ఒబెరాయ్, కాంచనా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపిస్తారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, చిరంజీవి సందీప్ రెడ్డి వంగాకు ఫేవరెట్ హీరో కావడం, సినిమా ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఒకవేళ ప్రభాస్ – చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, బాక్సాఫీస్ రికార్డులు ఖచ్చితంగా బద్ధలవుతాయని అభిమానులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!