
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం విడుదల తేదీపై మరోసారి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుందనే ప్రచారం కొనసాగుతుండగా, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి ప్రత్యేక అప్డేట్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!