

టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆర్య సినిమాతో మొదలైన వీరి ప్రయాణం రంగస్థలం వరకు ఎన్నో విజయవంతమైన ఆల్బమ్‌లను అందించింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC 17 విషయంలో ఈ కాంబినేషన్ కొనసాగడం లేదనే వార్తలు ఫిలింనగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు దేవిశ్రీ స్థానంలో అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దేవిశ్రీ ఎల్లమ్మతో పాటు ఇతర చిత్రాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సుకుమార్ సినిమాల్లో దేవిశ్రీ అందించే జానపద బాణీలు, నేపథ్య సంగీతానికి ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. అందుకే ఈ మార్పు అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన RC 17కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టడం విశేషం. రంగస్థలం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిరుధ్ తనదైన కొత్త శైలితో ఈ చిత్రానికి సంగీతం అందించనున్న నేపథ్యంలో దేవిశ్రీ లేని లోటును భర్తీ చేయగలడా అనే ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ మార్పుపై స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!