
జనరల్

మెప్మా అడిషనల్ డైరెక్టర్ యాదగిరి రావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ హైకోర్టు కాలనీలో ఉన్న ఆయన నివాసంతో పాటు సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గతంలో యాదగిరి రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మెప్మా అడిషనల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!