

ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. సూర్య, ధనుష్‌లను ఒకే సినిమాలో చూపించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కథాంశం గురించి ఇద్దరు హీరోలతో చర్చించగా, వాళ్లు కూడా ఆసక్తి చూపించి ప్రాజెక్టుకు సానుకూలత తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. నిజంగా ఈ కలయిక కార్యరూపం దాలిస్తే అభిమానులకు పెద్ద పండగే.గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఆయుధ ఎళుత్తు సినిమాలో సూర్య నటించారు. ఆ చిత్రంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ధనుష్ మాత్రం ఇప్పటివరకు మణిరత్నం దర్శకత్వంలో పనిచేయలేదు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఆయనకు ఇదే తొలి సినిమా అవుతుంది. నటనలో తమదైన ప్రత్యేకత కలిగిన సూర్య, ధనుష్‌లను మణిరత్నం ఎలాంటి కథలో చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!