

విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ENE రిపీట్ పై ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథలో కీలకమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన సందడి చేయనున్నారట. ఇందులో ఆయన ఒక సినిమా దర్శకుడి పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.మరోవైపు ఈ చిత్రం విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ఇద్దరికీ ఎంతో కీలకంగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి ప్రత్యేక పాత్ర కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!