

ఒకప్పుడు వరుస చిత్రాలతో దూసుకెళ్లిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇటీవల ఆశించిన విజయాలు దక్కడం లేదు. దీంతో బలమైన విజయంతో తిరిగి పుంజుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ప్రభాస్‌తో మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆదిపురుష్ పంపిణీ బాధ్యతలు చేపట్టగా, ఆ సినిమా నిరాశపరిచింది. అలాగే ప్రభాస్, మారుతి కలయికలో రూపొందించిన ది రాజాసాబ్ కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ మరోసారి ప్రభాస్‌తో సినిమా చేయాలని నిర్మాతలు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో దర్శకుడు కరుణాకరన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన డార్లింగ్ మంచి విజయాన్ని అందుకోవడంతో అదే కాంబినేషన్‌ను మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కూడా ప్రభాస్‌కు ఓ థ్రిల్లర్ కథ వినిపించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాలున్నాయి. వీటి షెడ్యూల్స్‌ను బట్టి కొత్త సినిమా 2028లో మొదలయ్యే అవకాశముంది. మరి ఏ దర్శకుడికి అవకాశం దక్కుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!