

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తదుపరి చిత్రం ‘దాదా’. సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో కొంతకాలం చిత్రీకరణకు బ్రేక్ పడింది. అనంతరం ఆయన శస్త్రచికిత్స చేయించుకుని, కోలుకున్న తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, దీపావళి సందర్భంగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆల్బమ్‌లో మొత్తం నాలుగు పాటలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది.
‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘దాదా’. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!