

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో వారణాసి ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ విడుదలైన తర్వాత, ముఖ్యంగా మహేష్ బాబు ‘రుద్ర’ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టంచేసింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మహేష్ బాబు ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఇందులో ప్రధాన పాత్ర ‘రుద్ర’, సూపర్ పవర్ ఉన్న పాత్రగా కథకు కేంద్ర బిందువుగా ఉంటుందని టాక్. కథానాయికగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో కనిపించనుండగా, ఆమె పాత్ర కథలో కీలక మలుపులు తిప్పుతుందని అంటున్నారు. విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’గా నటిస్తారని సమాచారం. అలాగే మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారట. ఈ కథ మొత్తం వారణాసి నేపథ్యంతో, హిందూ పురాణాలు మరియు టైమ్ ట్రావెల్ అంశాలతో సాగుతుందని తెలుస్తోంది.
ఇటీవల లీకైన వివరాల ప్రకారం, రుద్రతో పాటు మహేష్ బాబు భగవాన్ రాముడిగా, శివుడి ఛాయలున్న పాత్రలో కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు మరో రెండు కీలక పాత్రలు కథలో పెద్ద ట్విస్టులకు కారణమవుతాయని అంటున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, హాలీవుడ్ టెక్నీషియన్ల భాగస్వామ్యం వల్ల ఈ సినిమా టెక్నాలజీ పరంగా మరో స్థాయిలో ఉండనుంది. షూటింగ్ 2026 నాటికి పూర్తిచేసి, భారీ పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత 2027 సమ్మర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!