
సినిమాలు

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 25న విడుదల చేసే దిశగా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.
ప్రస్తుతం ఈ సినిమా కోసం రెండు యూనిట్లు ఒకేసారి చిత్రీకరణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక యూనిట్ రాత్రి వేళల్లో షూటింగ్ చేస్తుండగా, మరో యూనిట్ సాధారణ షెడ్యూల్లో చిత్రీకరణ కొనసాగిస్తోంది. నాని రెండు యూనిట్ల మధ్య సమయాన్ని పంచుకుంటూ షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!