
రాజకీయాలు

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం మోక్షజ్ఞ సినీ అరంగేట్రం. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన తొలి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అనంతరం పలువురు దర్శకులతో మోక్షజ్ఞ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చినా, ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్‌పై అధికారిక స్పష్టత రాలేదు.
తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కే అవకాశముందని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో 'స్పిరిట్', ఆ తర్వాత 'యానిమల్ పార్క్' చిత్రాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!