

బాలకృష్ణ హోస్ట్‌గా కొనసాగుతున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమం ఇప్పటికే 4 సీజన్లను పూర్తి చేసుకుంది. మొత్తం 35 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించిన ఈ కార్యక్రమానికి భారీ ఆదరణ లభించింది. 4వ సీజన్ 2025 జనవరిలో ముగిసింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు 5వ సీజన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే ఆలస్యానికి కారణమనే ప్రచారం వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే మరోవైపు చిరంజీవి టాక్ షోకు సంబంధించిన వార్తలు కూడా తెరపైకి రావడంతో వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరిగింది. దీంతో ‘అన్‌స్టాపబుల్’ కొత్త సీజన్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్న బాలయ్య అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే కార్యక్రమం తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి వంటి విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అప్పటివరకు వస్తున్న వార్తలను ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!