

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ వెబ్‌సైట్లు, ఉపాధి సేవలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ‘ఎన్‌సీఎస్ వన్ (NCS One)’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా వివిధ ఉద్యోగ వేదికల్లోని సమాచారం ఒకేచోట అందుబాటులోకి రానుంది. అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవానికి అనుగుణంగా ఉద్యోగాలను సులభంగా వెతుక్కునే అవకాశం కలుగుతుంది.
అసంఘటిత రంగ కార్మికులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈ పోర్టల్‌ను ఈ-శ్రమ్‌తో అనుసంధానం చేయనున్నారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు సహా పలు నగరాల్లో కెరీర్ లాంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా యువతకు కెరీర్ మార్గదర్శకత్వం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అనుసంధాన సేవలు అందించనున్నారు. ఈ కొత్త వేదికతో ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశాలను గుర్తించడం, తగిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం మరింత సులభతరం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!