

అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక హెచ్చరిక జారీ చేశారు. పవిత్ర పంబా నదిలో స్నానాలు చేసిన తర్వాత దుస్తులను అక్కడే వదిలేయడంపై నిషేధం విధించారు. కొందరు భక్తులు స్నానాల అనంతరం ధరించిన దుస్తులను నదిలోనే వదిలేస్తుండటంతో ప్రతిరోజూ పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా నది నీరు కలుషితమవుతోందని, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంబా నది పరిశుభ్రతను కాపాడేందుకు నిబంధనలను కఠినతరం చేశారు.
పంబా నదిలో దుస్తులు పడేయడం లేదా వదిలేయడం నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే భక్తులకు రూ.5,000 వరకు జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నారు. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు నది పవిత్రతను, పరిశుభ్రతను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తి పేరుతో పర్యావరణానికి హాని కలిగించే ఆచారాలను విడనాడాలని, వస్త్ర వ్యర్థాలను సరైన ప్రదేశాల్లోనే పారవేయాలని సూచిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!