

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పెళ్లిపై మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ చిన్న కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌తో సారా ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు క్రికెట్, బాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు.. అసలు ఈ ప్రచారంలో నిజమెంత అనే చర్చకు దారితీశాయి.
సారా, రాజ్‌వీర్ ఓ పార్టీలో తొలిసారి కలిశారని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, వీరి వివాహంపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సారా టెండూల్కర్ కానీ, రాజ్‌వీర్ డియోల్ కానీ తమ పెళ్లి వార్తలపై స్పందించలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్తలను ధ్రువీకరించని ప్రచారంగానే పరిగణించాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!