
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం సన్నద్ధమవుతున్నారు. ‘పెద్ది’ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో చేయనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
తాజాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అలాగే ‘పెద్ది’ కోసం సిద్ధం చేసిన బల్క్ లుక్ నుంచి రామ్ చరణ్ క్రమంగా స్లిమ్ అవుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!