

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరో నితిన్ ఇప్పుడు తన కెరీర్‌కు కొత్త ఊపు తీసుకురావడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథలకు దూరంగా ఉంటూ విభిన్న జానర్లలో మూడు ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి కంటెంట్ ప్రధానమైన కథల వరకు విభిన్న దిశల్లో అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ చివరి దశ చిత్రీకరణలో ఉందని, ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్. మరోవైపు నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ఓ కొత్త తరహా కథతో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో "ఆయ్" దర్శకుడు అంజితో కూడా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు ప్రాజెక్ట్‌లపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!