

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ‘దసరా’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు కొనసాగుతుండగా విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా వ్యాపారానికి సంబంధించిన వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
చిత్ర థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన భారీ మొత్తంతో ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసే చిత్రంగా ఇది నిలుస్తుందనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం స్పందిస్తూ అధికారిక సమాచారం ఏదైనా ఉంటే తామే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!