

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్టుల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా కథ, ప్రభాస్ పాత్ర, దర్శకుడి టేకింగ్ గురించి వస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌పై చిత్రబృందం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి వేళలో జరిగే ఈ సన్నివేశంలో ప్రభాస్ ఒంటరిగా దాదాపు 50 మంది రౌడీలతో పోరాడనున్నట్లు ప్రచారం సాగుతోంది. సందీప్ రెడ్డి వంగ మాస్ టేకింగ్‌కు తగ్గట్టుగా ఈ ఘట్టాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ లుక్, యాక్షన్ స్టైల్, విజువల్ ప్రెజెంటేషన్ ఈ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు భావిస్తున్నారు. త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!