
షోస్

అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు చెందిన ఓ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మీరు చైనీయులా?” అని అడిగిన ప్రశ్నకు స్పందించిన చిన్నారి. “మేము చైనీస్ కాదు. మేమూ భారతీయులమే. మా రూపాన్ని చూసి మమ్మల్ని చైనీయులుగా పిలవకండి” అని స్పష్టం చేసింది. ఆమె మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.
తమ ముఖ కవళికలు, రూపురేఖలు భిన్నంగా ఉన్నంత మాత్రాన తమ భారతీయ గుర్తింపును, దేశభక్తిని ప్రశ్నించవద్దని చిన్నారి పేర్కొంది. “మా ముఖం వేరుగా ఉండొచ్చు..కానీ మా దేశం మాత్రం భారత్” అనే సందేశాన్ని ఆమె తన మాటల ద్వారా బలంగా చాటిచెప్పింది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తూ చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!