

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ గురువారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనను తిహార్ జైలు నుంచి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పునరుజ్జీవన చర్యలు, లైఫ్ సపోర్ట్ అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు. సజ్జన్ కుమార్‌కు అధిక రక్తపోటు, పార్కిన్సన్ వ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఆస్పత్రి తెలిపింది.
1984 అల్లర్ల సమయంలో ఐదుగురు సిక్కుల హత్య, గురుద్వారా దహనం కేసులో 2018లో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 2025 ఫిబ్రవరిలో మరో కేసులో ఇద్దరు సిక్కుల హత్యకు సంబంధించి మరో జీవిత ఖైదు శిక్ష పడింది. ఔటర్ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన, 2018లో శిక్ష పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!