

సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్ చేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం తన తల్లి సోనియా ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను రాహుల్ గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా పెద్దగా వెల్లడించని తన తల్లి, తన అనుభవాలను పుస్తక రూపంలో పంచుకోవడానికి ముందుకు రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రస్తుతం తన తండ్రి సోనియా గాంధీని చూసి గర్వపడుతుంటారని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన తల్లిదండ్రుల అనుబంధాన్ని అద్భుతమైన ప్రేమబంధంగా అభివర్ణించారు. తన భావోద్వేగాలను నిజాయతీగా పుస్తకంలో వ్యక్తం చేసిన తల్లిని చూసి గర్వంగా ఉందని తెలిపారు. అవసరమైన సమయంలో తన తల్లి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అని ప్రశంసించారు. ఇప్పటివరకు సోనియా గాంధీని రాజకీయ నాయకురాలిగా మాత్రమే చూసిన వారికి ఈ పుస్తకం ద్వారా ఆమె వ్యక్తిగత జీవితం, కుటుంబం, దేశంపై ఉన్న ప్రేమ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుందని ప్రియాంక అన్నారు. ఈ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!