

ప్రభాస్ హీరో గా నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదలకు కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా ఎంతటి హంగామా తో విడుదల అయ్యేవో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్ లేదా ఫ్లాప్ పక్కన పెడితే, తొలి రోజు వసూళ్ల పరంగా ప్రభాస్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. బాహుబలి తర్వాత చేసిన ఐదు సినిమాల్లో మూడు సినిమాలు మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాయి అంటే, ఆయన మార్కెట్ స్థాయి ఏంటో అర్థమవుతుంది.
అయితే ‘ది రాజా సాబ్’ విషయంలో ఆ స్థాయి హైప్, మేనియా, యుఫోరియా ఇప్పటివరకు ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు మిగిలిన ఆశలు ప్రీ రిలీజ్ ఈవెంట్లపైనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అలాగే అమెరికాలో ఒక ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ కూకట్పల్లి గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక సెంటిమెంట్ కలవరపెడుతోంది. కూకట్పల్లి గ్రౌండ్స్‌లో జరిగిన గత ప్రీ రిలీజ్ ఈవెంట్ల తర్వాత సినిమాలు సక్సెస్ కాలేదని, ఈ ప్రాంతానికి ‘ఐరన్ లెగ్’ అనే పేరు ఉందని కొందరు నమ్ముతున్నారు. అలాంటి చోట ఈవెంట్ ఏర్పాటు చేయడం ఎందుకు? సినిమా ఫలితంపై మేకర్స్‌కు నిజంగా నమ్మకం ఉందా? ప్రభాస్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే నిర్మాత విశ్వప్రసాద్‌పై కూడా కొంతమంది నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ సినిమాపై నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ‘ది రాజా సాబ్’ విడుదలకు ముందు అనేక సందేహాలు, చర్చలు తెరపైకి వస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!