

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'రామాయణ'పై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ చర్చనీయాంశంగా మారుతోంది. ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో, ఇప్పుడు సినిమా ఆడియో హక్కుల అంశం కూడా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఆడియో సంస్థ టీ-సిరీస్ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు రూ.75 కోట్ల విలువైన ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇద్దరు దిగ్గజాలు ఒకే ప్రాజెక్ట్‌పై పనిచేస్తుండటంతో సినిమా సంగీతంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేపథ్య సంగీతం నుంచి పాటల వరకు ప్రతి అంశాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాణ విలువలు, తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపికతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చిత్రం, ఇప్పుడు ఆడియో హక్కుల వార్తతో మరోసారి వార్తల్లో నిలిచింది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!