
జనరల్

మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని సమాచారం అందినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం పెద్దలు ఆమెను ఢిల్లీకి రావాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సురేఖను ఢిల్లీకి ఎందుకు పిలిచారనే అంశంపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఈ పరిణామంపై రాజకీయ చర్చ మొదలైంది.
సురేఖతో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్ననే మాట్లాడినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలనే సమాచారం రావడంతో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో పార్టీ పెద్దలతో భేటీ అనంతరం దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!