
జనరల్

బీజేపీ నేత, కర్ణాటక బీజేపీ ఎకనామిక్ సెల్ మాజీ కన్వీనర్ డా. సమీర్ కగల్కర్కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు బిల్లుకు సంబంధించి రూ.1,200కు పైగా ఛార్జ్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. రూ.10,649.46 బిల్లుకు ఆయన రూ.10,649 చెల్లించగా, మిగిలిన 46 పైసాల కారణంగా అదనపు ఛార్జీలు విధించారని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. దీంతో ఈ అంశంపై ఆన్లైన్లో పలువురు స్పందించారు.
ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఛార్జీలను వన్‌టైమ్ గుడ్‌విల్ జెస్చర్గా వెనక్కి తీసుకుంది. అయితే వర్తించే గ్రేస్ పీరియడ్ తర్వాతే చెల్లింపు అందిందని బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ ఘటన క్రెడిట్ కార్డు చెల్లింపుల గడువులు, బకాయి మొత్తాలు, ఆలస్య చెల్లింపులపై విధించే అదనపు ఛార్జీలపై మరోసారి చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!