
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం 5 శాతం పెంపును ప్రతిపాదించినప్పటికీ, దీనిపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పెంపు తమ డిమాండ్లకు సరిపోదని వారు అభిప్రాయపడుతున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరుతున్నారు.
తమ స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొత్తగా ఎలాంటి ప్రకటన వెలువడలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని జూడాలు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల మధ్య తదుపరి చర్చలపై ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!