

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ చర్చకు కారణమైన ఈ చిత్రానికి ఉన్న హైప్‌కు తగ్గట్టుగానే బిజినెస్ లెక్కలు కూడా సంచలనంగా మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచే ₹320 కోట్లకు పైగా బిజినెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాల బిజినెస్ రికార్డులకు ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ, కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!