
క్రీడలు

ఉత్తర కొరియా తన నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సేవల్లోకి తీసుకున్న 5,000 టన్నుల తరగతి ‘కాంగ్ కన్’ డిస్ట్రాయర్‌ను అణు ప్రతిస్పందన వ్యవస్థలో భాగం చేసినట్లు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. శత్రువుల దాడులకు ఈ యుద్ధనౌక విధ్వంసకర ప్రతిదాడులు చేయగల సామర్థ్యం కలిగి ఉందని ఆయన హెచ్చరించారు.
కొరియా ద్వీపకల్పం చుట్టూ నౌకను మోహరించడం ద్వారా ప్రత్యర్థులకు తమ సైనిక సామర్థ్యంపై స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నట్లు కిమ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉత్తర కొరియా నౌకాదళాన్ని, అణు నిరోధక సామర్థ్యాలను మరింత పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏవైనా సైనిక బెదిరింపులు ఎదురైతే కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!