
షోస్

మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 12 మంది మృతి చెందారు. నివారం అర్ధరాత్రి ‘బాంబే విస్కీ’ పేరుతో విక్రయించిన మద్యం సేవించిన అనంతరం పలువురు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 10 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
బాధితుల్లో మిథైల్ ఆల్కహాల్ విషప్రభావానికి సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్రంగా స్పందించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అధికారులు ఆరు మద్యం దుకాణాలను సీజ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం దుకాణాల పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణలో అధికారుల పాత్రపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!