

కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన సమాచారం వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, మొదటగా చిత్రీకరించనున్న యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
హీరోయిన్ విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య లక్ష్మిని కథానాయికగా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తొలి షెడ్యూల్‌లో బాలయ్య పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ఈ షెడ్యూల్ 15 రోజులకు పైగా కొనసాగనుందని తెలుస్తోంది. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కథ కూడా విభిన్నంగా ఉండనుందని సమాచారం. ‘దేవర’ తర్వాత కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!