

బిగ్ బాస్ తెలుగు 10 ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ కాగా.. తొలి కంటెస్టెంట్‌గా బెంగాలీ నటి దేబ్జానీ హౌస్‌లోకి అడుగుపెట్టింది. వచ్చీ రాగానే తన క్యూట్ మాటలు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, మధురమైన పాటతో హోస్ట్ అక్కినేని నాగార్జునను ఇంప్రెస్ చేసింది. తన గురించి మూడు మాటల్లో చెప్పమని నాగార్జున్ అడగగా.. ఫన్ లవింగ్, హానెస్ట్, డే డ్రీమర్ అని దేబ్జానీ చెప్పింది. తన కలల గురించి కూడా సరదాగా వివరించింది. తన ‘రాజకుమారుడు’ స్టాండ్బైలో ఉన్నాడని, రిలేషన్షిప్ కన్ఫామ్ అయితే ముందుగా నాగార్జునకే చెబుతానంటూ సరదాగా మాట్లాడింది. అనంతరం నాగార్జున ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసి పాటతో ఆకట్టుకున్న దేబ్జానీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది. తనకు తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగితే క్షమించాలని ప్రేక్షకులను కోరింది. బెంగాలీ కావడంతో తన తెలుగు కొంత భిన్నంగా అనిపించవచ్చని కూడా చెప్పింది.
దేబ్జానీ సినీ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. ట్యూషన్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక మహిళ సీరియల్లో నటిస్తావా అని అడగడంతో ఆమెకు తొలి నటనా అవకాశం వచ్చినట్లు సమాచారం. తొలుత ఆమె తండ్రి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. తల్లి ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేసింది. తొలి సీరియల్ అనుకోని కారణాలతో ఆగిపోవడంతో నిరాశకు గురైంది. ఆ తర్వాత అదే సీరియల్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి సినిమా హీరోయిన్ పాత్ర గురించి చెప్పడంతో ఆమెకు మరో అవకాశం వచ్చింది. అనంతరం బెంగాలీలో వరుసగా ఏడు సినిమాల్లో నటించింది. సినిమాలు చేస్తున్నప్పటికీ టెలివిజన్‌పై ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తన తల్లిదండ్రులు సీరియల్స్‌ను ఎంతో ఇష్టంగా చూడటంతో బుల్లితెరపై కనిపించాలనే కోరిక మరింత పెరిగిందని దేబ్జానీ తెలిపింది. తమిళంలో రెండు ప్రాజెక్టులు చేసిన తర్వాత స్టార్ మా నుంచి అవకాశం రావడంతో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్లో నటించింది. ఈ సీరియల్ ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ‘సత్యభామ’ సీరియల్‌తోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దేబ్జానీ తల్లిదండ్రులు కోల్‌కతాలో ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారిని కలవడానికి వెళ్తుంటుంది. ట్రావెలింగ్‌ను ఇష్టపడే ఆమె.. ముఖ్యంగా తల్లిదండ్రులు, చెల్లితో సమయం గడపడం తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!