
షోస్

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అష్దార్లో కీలక పురోగతి సాధించారు. ఈ ఆపరేషన్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాది, పాకిస్తానీ పౌరుడు యాసిర్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఐదు అతిపెద్ద ఉగ్రదాడుల్లో యాసిర్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పూంచ్, బారాముల్లాలో జరిగిన ఉగ్రదాడులతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎన్కౌంటర్ అనంతరం అడవుల్లో దాక్కున్న ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మిగిలిన ఉగ్రవాదులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు, ఈ ప్రాంతంలో మరిన్ని దాడులు జరగకుండా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!