

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తాత్కాలికంగా AA22గా పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే వేగంగా సాగుతోంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ‘పుష్ప’ లో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక - అల్లు అర్జున్ జోడీకి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అట్లీ ఈ కాంబోను మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్లో రష్మికకు సంబంధించిన సోలో సీన్లు కూడా షూట్ చేసినట్లు టాక్.
ఈ సినిమాలో రష్మిక సాధారణ గ్లామర్ పాత్రలో కాకుండా, నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆమె పాల్గొనబోతున్నారట. ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది పూర్తిగా కొత్త అనుభవం కావడంతో, ఆమె కెరీర్లో ఇది కీలక మలుపుగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. అట్లీ మాస్ స్టైల్‌కు అల్లు అర్జున్ ఎనర్జీ కలిస్తే మరో బాక్సాఫీస్ సంచలనం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!