

బాక్సాఫీస్ వద్ద రామాయణ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ హిందీ చిత్రం సాధించని అరుదైన ఘనతను ఈ సినిమా సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని 5 ప్రధాన ప్రాంతాల్లో ఒక్కో చోట రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హిందీ చిత్రంగా రామాయణ నిలిచింది. హిందీ బెల్ట్‌తో పాటు కర్ణాటక, ఏపీ-తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది.
ఇప్పటివరకు దంగల్, పఠాన్, జవాన్, యానిమల్, ధురంధర్, ధురంధర్ 2 వంటి భారీ విజయాలు సాధించిన చిత్రాలు కూడా ఈ ప్రత్యేకమైన రికార్డును అందుకోలేకపోయాయి. అయితే రామాయణ మాత్రం భాషా ప్రాంతాల హద్దులను దాటి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషంగా మారింది. ఒక హిందీ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో ఇంతటి స్పందన రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. దీంతో రామాయణ సాధించిన ఈ ఘనత ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!