

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ రేపటితో పూర్తికానుంది. గత మూడు రోజులుగా రామ్ చరణ్ మరియు శృతి హాసన్ పై ఐటెం పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కూడా రేపటితో పూర్తవుతుంది. ఈ సినిమాను మొదటగా జూన్ 25న విడుదల చేయాలని దర్శకుడు బుచ్చి బాబు ప్రకటించాడు. కానీ ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో, ఇప్పుడు ‘పెద్ది’ను జూన్ 4న విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇప్పటికే క్రికెట్ మరియు కుస్తీ ఆడినట్లు చూపించారు. ఇప్పుడు ఆయన మూడవ స్పోర్ట్ కూడా ఆడినట్లు సమాచారం. ఆ స్పోర్ట్ ఏమిటో మాత్రం ఇప్పటివరకు రహస్యంగా ఉంచారు. ఈ స్పోర్ట్ సన్నివేశాలు సినిమా చివరి 40 నిమిషాల్లో వస్తాయని, అందులో రామ్ చరణ్ అద్భుతమైన నటన చూపించాడని చెబుతున్నారు.
ఈ క్లైమాక్స్ సన్నివేశాలు అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఈ సినిమాలోని ఆయన నటనకు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ మూడవ స్పోర్ట్‌కు సంబంధించిన టీజర్ విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అలాగే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కావచ్చు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!