

భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా,
యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శూర్పణఖ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ముంబైలో ఆమె రూప పరీక్ష పూర్తయిందని తెలుస్తోంది.
ఇటీవల ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొన్నట్లు వార్తలు రావడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో కనిపించిన రకుల్, ఇప్పుడు పౌరాణిక పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. మరోవైపు యష్‌పై కీలక యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అత్యాధునిక దృశ్య సాంకేతికతతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్న చిత్ర బృందం, తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!